- Advertisement -
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ అధికారులు తన ఇంటిని సీజ్ చేయడంపై హైకోర్టులో ప్రభాస్ పిటిషన్ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తీర్పుపై ప్రభాస్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు నేడు విచారించనుంది. అయితే తనకు నోటీసులివ్వకుండానే గెస్ట్‌హౌస్‌ను అధికారులు సీజ్ చేశారంటూ.. ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు.
హైదరాబాద్‌లోని రాయదుర్గం సమీపంలో ‘పైగా’ భూముల్లో నిర్మాణాలను రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేశారు. ఆ ప్రాంతంలో ఉన్న సినీహీరో ప్రభాస్ గెస్ట్‌హౌస్‌ను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ అతిథిగృహం వద్ద ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గేటుకు నోటీసు అంటించి సీజ్ చేశారు. ప్రభుత్వ స్థలమని పేర్కొనే సూచికలను ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు.
- Advertisement -