తెలంగాణ భవన్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. సంస్థాగతంగా పటిష్ఠంగా పార్టీ నిర్మాణం చేసి, ఎక్కడికక్కడ పార్టీ కార్యాలయాలతో పాటు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పారు. ‘‘తెరాసను భవిష్యత్తులో తిరుగు లేని రాజకీయ శక్తిగా మార్చేందుకు కేసీఆర్ ముఖ్యమైన బాధ్యతను నాకు అప్పగించారు.
మీ అందరి మద్దతుతో సీఎం కేసీఆర్ నాపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాను. పార్టీని అజేయ శక్తిగా మలిచే క్రమంలో మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాను, భగవంతుడు నాకిచ్చిన శక్తిని మీకోసం వినియోగిస్తాను అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అఖండమైన మెజార్టీ ఇచ్చారు. కుల, మతాలకు అతీతంగా టీఆర్ఎస్ను ఆశీర్వదించారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటాను.
బంగారు తెలంగాణ కోసం సవ్యంగా పని నిర్వర్తిస్తాను. ప్రజలకు వందేళ్లు సేవ చేసేలా పార్టీ కార్యక్రమాలను తీర్చిదిద్దుతా. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పార్టీ ఉండేలా కృషి చేస్తాను. భగవంతుడు నాకిచ్చిన శక్తిని మీకోసం వినియోగిస్తా.. తనకు మద్దతు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ వినమ్రంగా, హృదయపూర్వకంగా ధన్యవాదాలు అని కేటీఆర్ పేర్కొన్నారు.