నేడు ఛత్తీస్‌గఢ్‌ సీఎంగా భూపేష్ ప్రమాణస్వీకారం..

381
bhupesh-baghel
- Advertisement -

ఛత్తీస్‌గఢ్‌లో 15 ఏండ్లుగా విపక్షంలో కూర్చున్న కాంగ్రెస్‌ను.. అధికారంలోకి తీసుకువచ్చిన ఆ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేశ్ బఘేల్.. ఈ రోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటివ‌లే జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీకి అత్య‌ధికంగా సీట్లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

Bhupesh Baghel

ఆ రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి ఎవ‌రా అన్న‌దానిపై కొద్ది రోజులుగా చ‌ర్చ న‌డుస్తోంది. ఎట్ట‌కేల‌కు ఆ చ‌ర్చ‌ల‌కు స్వ‌స్తీ ప‌లికింది కాంగ్రెస్ అధిష్టానం. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత భూపేష్ బాఘెల్ ను అధిష్టానం ఖ‌రారు చేసింది. రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నిన్న జ‌రిగిన సీఎల్పీ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి పేరును అధికారికంగా ప్ర‌క‌టించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి సీఎం రేసులో ఉన్న టీపీ సింగ్‌ దేవ్‌, తమరాథ్‌వాజ్ సాహు, భూపేష్ బాఘెల్‌ , చరణ్ దాస్ మహంత్‌లతో కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స‌మావేశ‌మ‌య్యి భూపేష్ ను సీఎంగా ఖ‌రారు చేశారు.

- Advertisement -