వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్‌..

366
KTR
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి సమీపంలోని రౌండ్‌ టేబుల్‌ స్కూల్‌ నుంచి భారీ ర్యాలీగా తెలంగాణభవన్‌కు చేరుకున్న కేటీఆర్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి కేటీఆర్ పూలమాల వేశారు. తెలంగాణ భవన్లోని జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ktr

అనంతరం పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చాంబర్‌లోకి చేరుకున్న కేటీఆర్.. వేదపండితుల ఆశీర్వచనాల మధ్య వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ లో పండుగ వాతావరణం నెలకొంది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్‌కు హోంమంత్రి మహముద్ అలీ, పలువురు మాజీ మంత్రులు, శాసనసభకు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు అభినందనలు తెలిపారు.

- Advertisement -