టీఆర్ఎస్ లో చేరిన వైరా ఎమ్మెల్యే రాములు నాయ‌క్..

296
ramulu naik Trs
- Advertisement -

వైరా ఎమ్మెల్యే రాములు నాయ‌క్ తెలంగాణ భ‌వ‌న్ లో మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈసంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నిక‌ల త‌ర్వాత తెలంగాణ భ‌వ‌న్ లో మొట్ట‌మొద‌టి చేరిక కార్య‌క్ర‌మం రాములు నాయ‌క్ దే అన్నారు. రాములు నాయ‌క్ ఏమి ఆశించ‌కుండా పార్టీలో చేరార‌ని… వైరా నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ది చేసే బాధ్య‌త నేను మీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీసుకుంటామ‌న్నారు.

ktr ramulu naik

ఖ‌మ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్ట్ పూర్తిచేసి మ‌రో 10ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీరందించే బాధ్య‌త త‌మ మీద ఉంద‌న్నారు. ఇంటింటికి మంచినీరు అందించే మిష‌న్ భ‌గీర‌థ కార్య‌క్ర‌మం 90శాతం పూర్తైంద‌ని మ‌రో రెండు నెల‌ల్లో పూర్తి కానుంది. దేశంలో ఏ రాష్ట్రం చేప‌ట్ట‌ని విధంగా తెలంగాణ‌లో అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నామ‌ని చెప్పారు. దేశంలో ఏ జాతీయ పార్టీ కూడ సొంతంగా అధికారంలోకి వ‌చ్చే పరిస్ధితి లేద‌న్నారు.

కేంద్రంలో నాన్ కాంగ్రెస్ , నాన్ బీజేపీ పార్టీలు అధికారంలోకి రావాల‌న్నారు. మ‌న రాష్ట్రంలో బీజేపీ 119స్ధానాల్లో పోటీ చేస్తే 103 స్ధానాల్లో డిపాజిట్ కూడా ద‌క్క‌లేద‌న్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఎవ‌రూ అధికారంలో ఉన్నా వాళ్ల అధికారం కోసం తప్ప దేశాన్ని ఎవ‌రూ అభివృద్ది చేయ‌డం లేద‌న్నారు. జాతీయ పార్టీల‌కు ఎవ్వ‌రికి స‌రైన మెజార్టీ రాద‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో 16ఎంపీలు స్ధానాలు గెలిచి ఢిల్లీ గ‌ద్దె మీద ఎవ‌రూ కూర్చోవాలో తెలంగాణ ప్ర‌జానికం నిర్ణ‌యించాల‌న్నారు.

- Advertisement -