ఇంకెన్నాళ్ళు.. ఈ చరిత్ర

176
Online News Portal
Telugu Movie Ee Charitra Inkennallu
- Advertisement -

విజెవైఎస్‌ఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై వై.శేషిరెడ్డి సమర్పణలో రవి దర్శకత్వంలో తమిళంలో ఘనవిజయం సాధించిన ‘తర్కప్పు’ చిత్రాన్ని ‘ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు’గా వై.శేషిరెడ్డి తెలుగులో ప్రేక్షకులకు అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ఈ నెల 4న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా ‘ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు’ చిత్ర విశేషాలను చిత్ర సమర్పకుడు వై.శేషిరెడ్డి తెలియజేస్తూ’.. ‘చట్టసభల్లో కూర్చుని చట్టాలు తయారుచేసే రాజకీయనాయకులు.. ఆ చట్టాన్ని కాపాడాల్సిన కొంతమంది పోలీస్‌ అధికారులు పారిశ్రామికవేత్తలతో కలిసి సామాన్య మానవుల జీవితంతో ఏ విధంగా ఆడుకుంటున్నారు? చివరకు ఏం జరిగిందనే కథాంశంతో సాగే చిత్రమే ‘ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు.

ఇటీవల సమాజంలో జరిగిన ఓ బర్నింగ్‌ ఇష్యూ ఆధారంగా రూపొందిన చిత్రమిది. చక్కని స్క్రీన్‌ప్లేతో, ప్రతి సన్నివేశం ఉత్కంఠ భరితంగా సాగుతూ అన్ని వర్గాల వారిని అలరించేలా చక్కని మెసేజ్‌తో రూపొందిన ఈ చిత్రం తమిళంలో చాలా పెద్ద హిట్‌ అయింది. శక్తివేల్‌వాసు, సముద్రఖని పోటాపోటీగా నటించిన సన్నివేశాలు, రెండు ప్రేమ జంటల చిలిపి విన్యాసాలు యువతను బాగా అలరిస్తాయి.

ముఖ్యంగా సినిమా క్లైమాక్స్‌ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేవిధంగా ఉంటుంది. పోలీస్‌ ఆఫీసర్‌గా శక్తివేల్‌వాసు, మానవ హక్కుల ఛైర్మన్‌గా సముద్రఖని, విలన్‌గా రియాజ్‌లు ఎవరికి వారు పోటీపడి నటించారు. కామెడీ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా అండర్‌ కరంట్‌గా మంచి మెసేజ్‌తో ఈ చిత్రం రూపొందింది. ఇటీవల యూట్యూబ్‌లో విడుదల చేసిన ట్రైలర్స్‌కి వ్యూయర్స్‌ నుంచి చాలా మంచి రెస్పాన్స్‌ లభించింది. బిజినెస్‌ పరంగా సినిమాకి చాలా మంచి క్రేజ్‌ లభించింది.

తమిళంలో లాగా తెలుగులో కూడా ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుందన్న నమ్మకముంది. తెలుగులో రైట్స్‌కి మంచి పోటీ వచ్చినప్పటికీ మా మీద నమ్మకంతో మాకిచ్చిన నిర్మాత మంజునాధగారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ నెల 4న భారీ ఎత్తున విడుదవుతోంది’ అన్నారు. శక్తివేల్‌వాసు, సముద్రఖని, వైశాలి, రియాజ్‌ తదితరులు నచించిన ఈ చిత్రానికి మాటలు: ఎం.రాజశేఖరరెడ్డి, ఫొటోగ్రఫి: జోన్స్‌ ఆనంద్‌, సంగీతం: ఎఫ్‌.ఎస్‌.ఫైజల్‌, సమర్పణ: వై.శేషిరెడ్డి, నిర్మాణం: విజెవైఎస్‌ఆర్‌ ఆర్ట్స్‌, దర్శకత్వం: రవి.

- Advertisement -