- Advertisement -
డిసెంబర్ 11న జరిగే అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు ఎన్నికల అధికారి రజత్ కుమార్. ఈసందర్భంగా ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారులు శిక్షణ ఇచ్చారని చెప్పారు. ఎప్పటికప్పుడు సీసీటీవీల ద్వారా లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు. ఎమ్మెల్యే అభ్యర్థులు, వారి ఏజెంట్లు స్ట్రాంగ్ రూమ్లను సందర్శించే అవకాశం కల్పిస్తున్నామని ఎన్నికల అధికారి తెలిపారు.
- Advertisement -