ఓటేసిన కేటీఆర్,కవిత,సంతోష్

239
kavitha vote
- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి కేటీఆర్ ఖైరతాబాద్‌లో క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటేయాలని పిలుపునిచ్చారు.

నిజామాబాద్ జిల్లా పోతంగల్‌లోని 177వ పోలింగ్ బూత్‌లో కవిత ఓటు వేశారు. సాధారణ ఓటర్లతో కలిసి క్యూలో నిలబడి ఆమె ఓటు వేశారు. రాజ్యసభ సభ్యుడు జే.సంతోష్ కుమార్ కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ప్రజాకూటమి ఛైర్మన్‌ కోదండరామ్‌ కుటుంబ సభ్యులతో కలిసి తార్నాకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కూకట్‌పల్లి తెదేపా అభ్యర్థి నందమూరి సుహాసిని నాంపల్లి హుమయూన్‌ నగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.కరీంనగర్‌లోని కాశ్మీర్ గడ్డ యునైటెడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- Advertisement -