సుమ‌న్ నా కొడుకులాంటోడుః సీఎం కేసీఆర్

292
kcr suman
- Advertisement -

చెన్నూరు టీఆర్ఎస్ అభ్య‌ర్ధి బాల్క సుమ‌న్ త‌న‌కు కొడుకు లాంటివాడ‌న్నారు సీఎం కేసీఆర్. నా కుమారుడు రామారావు ఎంతో నాకు సుమ‌న్ కూడా అంతే అన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఇవాళ చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌ర్య‌టించారు. ఈసంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ. ఉద్య‌మ స‌మ‌యంలో సుమ‌న్ పై వంద‌ల కేసులున్నాయి. అయినా అత‌ను బ‌య‌ప‌డ‌లే రాష్ట్ర సాధ‌నే ల‌క్ష్యంగా ఉద్య‌మం చేశాడు.

kcr
సుమ‌న్ రెండు నెల‌లు చంచ‌ల్ గూడ జైలులో ఉండి వ‌చ్చిండు…జైలు నుంచి రాగానే నేను అడిగినా..సుమ‌న్ భ‌య‌ప‌డ్డావా అంటే మీరు ఉన్నంక నాకు ఏం భ‌యం సార్ అన్నాడు. ఇప్ప‌టికి కూడా సుమ‌న్ పై కొన్ని కేసులున్నాయ‌ని చెప్పారు సీఎం కేసీఆర్. సుమ‌న్ మీద చెన్నూరు ప్ర‌జ‌ల దీవెన‌లు ఉండాల‌న్నారు. సుమ‌న్ గెలిస్తే మాములు ఎమ్మెల్యేగా ఉండ‌డు మంచి ప‌ద‌విలో ఉంటాడ‌ని తెలిపారు.

suman

కలలో కూడా ఊహించని రాష్ట్ర పథకాలు చూసి కాంగ్రెస్‌కు కళ్లు మండుతున్నయని సీఎం మండిపడ్డారు. ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నరు. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు కాదు..ప్రజలు గెలవాలి. ప్రజలు పరిణతితో ఆలోచించి ఓటు వేయాలని సీఎం పిలుపునిచ్చారు.ఈసంద‌ర్భంగా కారు గుర్తుకు ఓటు వేసి సుమ‌న్ ను భారీ మెజార్టీతో గెలిపించాలిని చెన్నూరు ప్ర‌జ‌ల‌ను కోరారు.

- Advertisement -