మాస్ మహారాజ్ రవితేజ సరైన హీట్ లేక సతమతమవుతున్నాడు. ఇటివలే వచ్చిన రెండు సినిమాలు నేల టిక్కేట్, అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. దీంతో ఆయన తీవ్ర నిరాశలో ఉన్నారు. తన తర్వాత ప్రాజెక్ట్ పై తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రవితేజ తన తరువాతి సినిమా దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఉండనున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈసినిమాకు సంబంధింన రెగ్యూలర్ షూటింగ్ ను కూడా ప్రారంభించనున్నారు.
ఈసినిమాలో హీరోయిన్లుగా ఇద్దరిని తీసుకున్నారు. ఆర్ఎక్స్ 100మూవీ ఫేం పాయల్ రాజ్ పుత్ మరియు సమ్మోహనం సినిమాతో ఫేమస్ అయిన నభా నటేశ్ ను తీసుకున్నట్లు తెలుస్తుంది. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం నభానటేష్ ను ఈప్రాజెక్ట్ నుంచి తీసేసినట్టు తెలుస్తుంది. ఇటివలే విడుదలైన విజయ్ దేవరకొండ ట్యాక్సీవాలా సినిమాలో నటించిన ప్రియంక జువాల్కర్ ను హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం.