రజనీకాంత్-శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న 2.0 సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రి రిలీజ్ బిజినెస్‌తోనే దాదాపు రూ. 350 కోట్లు కొల్లగొట్టిన రజనీకాంత్ విడుదల తర్వాత మరిన్ని రికార్డులను చెరిపేయనున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ 2.0పై ఆసక్తికర కామెంట్ చేశారు.
తన ప్రచారం కోసం దెన్నైనా వాడుకునే సత్తాకలిగిన ఆర్జీవీ…రజనీ 2.0ను కూడా వాడేశాడు. భైరవగీత ప్రమోషన్‌లో భాగంగా 2. 0 చిన్న పిల్లల సినిమా అని తన స్టైల్‌లో స్పందించారు. అంతేగాదు పెద్దస్టార్లతో పెద్ద డైరెక్టర్ తీసిని చిన్న పిల్లల సినిమా 2.0 అని విమర్శించారు. చిన్న పిల్లాడు అయి సిద్దార్ద్ అడల్ట్ సినిమా భైరవగీత తీశారని ఎద్దేవా చేశారు. పిల్లల సినిమా చూస్తారా.? పెద్దల సినిమా చూస్తారా? అంటూ అభిమానులను ప్రశ్నించాడు.
నవంబర్ 29న 2.0 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. దాదాపు 10 వేల స్క్రీన్స్‌పై విడుదలవుతుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
. @ThathSidd ‘s Bhairava Geetha clashing with 2.0 in 8 days @Dhananjayaka @Irra_Mor @AbhishekPicture pic.twitter.com/wPL8yLH3KR
— Ram Gopal Varma (@RGVzoomin) November 22, 2018