వరల్డ్ వాటర్‌ కౌన్సిల్‌కు వి ప్రకాష్‌

371
kcr
- Advertisement -

తెలంగాణ జలవనరుల సంస్థ ఛైర్మన్ వి ప్రకాష్‌కు అరుదైన గౌరవం లభించింది. ఫ్రాన్స్‌లో నవంబర్‌ 30న జరిగే ప్రపంచ జలమండలి బోర్డు ఆఫ్ గవర్నర్స్ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లభించింది. ఆయన భారత్ తరపున గవర్నర్ అల్టర్‌నేట్‌గా పోటీ చేయనున్నారు. గత నాలుగుదశాబ్దాలుగా జలవనరులపై అధ్యయనం చేస్తున్న ప్రకాష్‌ చేస్తున్న కృషిని గుర్తించిన ఇండియన్ వాటర్ కౌన్సిల్,సెంట్రల్ బోర్డు ఆఫ్‌ ఇరిగేషన్ అండ్ పవర్ సంస్థలు ప్రకాష్‌ను వరల్డ్ వాటర్ బోర్డు ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆయన పేరును ప్రతిపాదించాయి.భారత ప్రభుత్వం తరపున ఈ ఎన్నికల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి.

ఈ అవకాశం తెలంగాణకే గర్వకారణమని ప్రకాష్ తెలిపారు. తాను గెలిస్తే గర్వకారణం. ప్రపంచ వ్యాప్తంగా నీటి కొరతను ఎదుర్కొంటున్న వందకు పైగా దేశాల్లో తెలంగాణ అనుసరిస్తున్న జల సంరక్షణ విధానాలను ప్రచారం చేస్తానని వి ప్రకాష్ ఈ సందర్భంగా తెలిపారు. 341 మంది సభ్యులున్న వరల్డ్ వాటర్ కౌన్సిల్‌లో భారత్‌ నుండే అత్యధిక సంఖ్యలో సభ్యులు ఉండటం గమనార్హం.దీంతో ప్రకాష్‌ గెలుపు నల్లేరుపై నడకే కానుంది.

Image result for V Prakash kcr

22 ఏళ్ల క్రితం ఫ్రాన్స్‌లో ఏర్పడిన వరల్డ్ వాటర్ కౌన్సిల్‌లో 151 దేశాల నుండి సభ్యులు ఉన్నారు. చైనా,జపాన్,మెక్సికో వంటి దేశాలతో పాటు ఐరాసా అనుబంధ సంస్థలు,పలు ఎన్‌జీవో సంస్థలు,కోకో కోలా,నెస్లే వంటి కార్పొరేట్ దిగ్గజ సంస్థలకు చెందిన సభ్యులు ఈ సంస్థలో మెంబర్లుగా ఉన్నారు. ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా పత్రి మూడేళ్లకోసారి ఈ సమావేశం జరగనుంది. మార్చిలో బ్రెజిల్‌లో ఈ సమావేశాలు జరుగగా మంత్రి హరీష్ హాజరయ్యారు.

వరంగల్ జిల్లాకు చెందిన వి ప్రకాష్  2001 నుండి కేసీఆర్ వెన్నంటే నడిచారు. తన రచనల ద్వారా తెలంగాణ భావజాల వ్యాప్తికి కృషి చేశారు.  సాగునీటి రంగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సామాన్యులకు సైతం అర్ధం అయ్యేలా ఎన్నో పుస్తకాల ద్వారా వివరించారు. లాయర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ప్రకాష్‌కు సాగునీటి రంగంలో విశేషమైన అవగాహన ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ తెలంగాణ జల వనరుల అధ్యయన, అభివృద్ధి సంస్థ బాధ్యతలు అప్పగించారు.

- Advertisement -