- Advertisement -
జనతా గ్యారేజ్, మన్యంపులి, కనుపాప, మనమంతా చిత్రాలతో తెలుగు ప్రజలకు దగ్గరైన హీరో, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. తెలుగులో మంచి మార్కెట్‌ను పెంచుకున్న మోహన్‌లాల్ మరోసారి ఒడియన్‌గా ప్రేక్షకుల ముందుకురానున్నాడు. తెలుగు, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకురానుంది.
దుబాయ్‌లో జరగబోయే మలయాళ యాక్టర్స్ ఛారిటీ ఈవెంట్ సందర్భంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు మోహన్ లాల్. ప్రస్తుతం జరుగుతున్న మీటూ ఉద్యమం మూణ్ణాళ్ల ముచ్చటేనని సంబోధించారు. మలయాళ ఇండస్ట్రీలో ఎటువంటి సమస్య లేదన్నారు.
లైంగిక వేధింపులు కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే జరుగుతున్నాయని అనుకోవడం కరెక్ట్ కాదని లైంగిక వేధింపులు ఎక్కడైనా జరుగుతాయన్నారు. మీటూ అనేది ఓ ఫ్యాషన్‌లా తయారైందని ఎక్కువ కాలం నిలబడలేవన్నారు. మీటూపై తాను స్పందించనని తెలిపారు.
- Advertisement -