జెర్సీ కోసం కష్టపడుతున్న నాని..!

261
nani jersey
- Advertisement -

దేవదాస్ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించిన స్టార్ హీరో నాని. ప్రస్తుతం ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ‘జెర్సీ’ అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ముగియగా రెండవ షెడ్యూల్ ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యవేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నాని సరసన కన్నడ యూటర్న్ ఫేమ్ శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తోండగా వీలైనంత త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏకధాటిగా జరుగుతున్న షెడ్యూల్‌లో రెస్ట్ లేకుండా పాల్గొంటున్నారు. ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపించనున్నారు.

పిరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నాని డ్యుయల్ రోల్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. సత్యరాజ్, బ్రహ్మాజీ, రోనిత్ కామ్రా తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్‌ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -