టీఆర్ఎస్‌..అందరి పార్టీ:కేటీఆర్

210
ktr amberpet
- Advertisement -

న్యాయవ్యవస్థలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుతామన్నారు మంత్రి కేటీఆర్. అంబర్ పేటలో అడ్వకేట్ ఫర్ టీఆర్ఎస్ కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్ ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పారు. సబ్బండ వర్గాల మద్దతుతో తెలంగాణ సాధించామని చెప్పారు.అందరం కలిసి కట్టుగాపోరాటం చేసి స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చుకున్నామని తెలిపారు.

కేసీఆర్ లాంటి సమర్థవంతమైన నాయకుడు తెలంగాణలో ఉన్నారు కాబట్టే మోడీ,రాహుల్‌ని ఎదుర్కొన్నామన్నారు. టీఆర్ఎస్ అందరి పార్టీ అన్నారు. హైకోర్టు విభజన జరగకుండా చంద్రబాబు-బీజేపీతో కలిసి అడ్డుకున్నారని ఆరోపించారు. హైకోర్టు విభజన కోసం ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని చంద్రబాబు సైంధవ పాత్ర పోషించారని దుయ్యబట్టారు.జ్యుడిషియరిలో చంద్రబాబుకు ఉన్న ఇన్‌ఫ్లూయన్స్‌ అందిరికి తెలిసిందే అన్నారు. ఎన్డీయే నుంచి చంద్రబాబు బయటికి వచ్చిన తర్వాత హైకోర్టు విభజనలో కదలిక వచ్చిందన్నారు.

పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటుచేశామని తెలిపారు. ప్రజల వద్దకే పాలన అనే నినాదంతో 31 జిల్లాలు,కొత్త రెవెన్యూ,మండలాలను ఏర్పాటుచేసి ముందుకుసాగామన్నారు. కొత్త జిల్లాలకు కొత్త కోడ్‌లు త్వరలో వస్తాయన్నారు. ఫాస్ట్ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటుచేస్తామని తెలిపారు కేటీఆర్.

గుంపైనా,కూటమైనా వారికి గెలుపై విశ్వాసం లేదన్నారు. అందుకే కులం,మతం ఆధారంగా ప్రజలను విడదీసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల కోసం కులాన్ని తెరమీదకు తెస్తున్న మహాకూటమి నేతలకు ప్రజలు బుద్దిచెప్పాలన్నారు.

తెలంగాణ ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత పరిస్థితి ఓసారి ఆలోచన చేయాలన్నారు. న్యాయవాదుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. న్యాయవాదుల హెల్త్ కార్డులు అందజేస్తామని చెప్పారు. న్యాయవాదుల న్యాయమైన డిమాండ్లను అందరితో చర్చించి ముందుకు తీసుకెళ్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు చూపించిన స్పూర్తి ఎప్పటికి మర్చిపోలేనిదన్నారు.

రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసిఉందామని టీఆర్ఎస్ నాడు,నేడు అదే చెబుతుందన్నారు. సెటిలర్ల చైతన్యాన్ని మహాకూటమి నేతలు తక్కువ అంచనా వేస్తున్నారని జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును మర్చిపోవద్దన్నారు.హైదరాబాద్ ప్రజల మంచినీటి సమస్య,పారిశుద్య సమస్యను తీర్చామన్నారు. చరిత్రలో లేని విధంగా నగరంలో ఇంజనీరింగ్ వర్క్స్ నడుస్తున్నాయని తెలిపారు. ప్రజారవాణ మెరుగు పర్చేందుకు కృషి చేశామన్నారు. ఎవరెన్ని రకాల కుట్రలు చేసినా తెలంగాణ అభివృద్ధి ఆగదన్నారు. కేసీఆర్ ప్రజల మనిషి అన్నారు.ఓయూ విద్యార్థులు,జర్నలిస్టులు,సాంస్కృతిక కళాకారులు,ఉద్యోగ సంఘాల నేతలకు టికెట్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు.

- Advertisement -