తమన్‌ @ 25

203
thaman
- Advertisement -

ఉర్రూతలూగించే హుషారైన పాటలకు ఆయన కేరాఫ్‌ అడ్రస్‌..హీరోల క్రేజ్‌ పెంచేలా టైటిల్ సాంగ్స్ కొట్టాలన్న..కథకు తగ్గ మెలోడీలు ఇవ్వాలన్న ఆయనకే సాధ్యం. క్లాస్,మాస్‌,రాక్‌ పాటేదైనా బ్లాక్ బస్టర్‌ కావాల్సిందే.సినీ సంగీత ప్రపంచంలో సెన్సేషన్‌గా మారిన ఆ సంగీత దర్శకుడే తమన్‌. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న తమన్‌ ఎందరో హీరోలకు ఇష్టమైన వ్యక్తిగా మారాడు.

తమన్‌ అసలు పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్‌ తమన్‌. దర్శక, నిర్మాత ఘంటసాల బలరామయ్యకు మనవడిగా కె.చక్రవర్తి వద్ద ఏడు వందల సినిమాలకు డ్రమ్మర్‌గా వ్యవహరించిన తండ్రిబాటలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

1993లో బాలకృష్ణ భైరవ ద్వీపం సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన తమన్ వంద సినిమాలకు సంగీతం అందించారు. అరవింద సమేతతో 100 సినిమాలు పూర్తి చేసిన తమన్ 67 మంది సంగీత దర్శకుల దగ్గర 900 సినిమాలకు మ్యూజిక్ ప్రోగ్రామర్‌గా వర్క్‌ చేసాడు. ఈ సందర్భంగా తమన్‌కి సోషల్ మీడియాలో, పలువురు సెలబ్రిటీల నుండి భారీగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -