సుప్రిమ్ స్టార్ సాయి ధరమ్ తేజ్ గత కొంత కాలం నుంచి ప్లాప్ లతో సతమతమవుతున్నాడు. ఇటివలే ఆయన నటించిన ఐదు సినిమాలు ప్లాప్ కావడంతో ఆయన సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో చిత్రలహరి అనే సినిమాలో చేయనున్నాడు. ఈసినిమాకు తేజ్ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కాని పట్టాలు మాత్రం ఎక్కలేదు. నేడు ఈసినిమా రెగ్యూలర్ షూటింగ్ ను ప్రారంభించారు .
ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు ఈమూవీలో తేజ్ కొత్త లుక్ లో కనిపించనున్నాడని సమాచారం. అందుకోసం అమెరికాలో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడని తెలుస్తుంది. ఈచిత్రంలో తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించనున్నారు.
ఇందులో వాళ్ల పేర్లు చిత్ర-లహరి కావడంతో అందుకే సినిమాకు చిత్రలహరి పేర్లు పెట్టారని టాక్. ఈ సినిమా కూడా లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కొనసాగుతుందట. ఏప్రిల్ లోఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో వున్నారు. ఈసినిమాతోనైనా తేజ్ విజయం సాధిస్తాడో లేదో చూడాలి.