ఫ్లిప్ కార్ట్ సీఈవో రాజీనామా..

229
binny flipkart
- Advertisement -

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్‌ సీఈవో బిన్నీ బన్సాల్ తన పదవికి రాజీనామా చేశారు. విధి నిర్వహనలో అలసత్వం,తోటి సిబ్బందితో అమర్యాదకర ప్రవర్తన ఆరోపణల నేపథ్యంలో ఆయన తన పదవి నుండి తప్పుకున్నారు.

కంపెనీ ప్రధాన వాటాదారుగా ఉన్న వాల్‌మార్ట్ ఈ అంశంపై స్పందించింది. బన్సాల్ రాజీనామా నిజమేనని దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపింది. బిన్నీ స్థానంలో ఫ్లిప్ కార్ట్ సీఈవోగా కల్యాణ్ కృష్ణమూర్తి బాధ్యతలు నిర్వహిస్తారని వెల్లడించింది. కల్యాణ్ ప్రస్తుతం మైంత్రా, జబాంగ్‌లకు సీఈవోగా ఉన్నారు.

భారతదేశంలో ఆన్ లైన్ బిజినెస్ చేసే సంస్థల్లోఫ్లిప్ కార్ట్ ముందువరుసలో ఉంటుంది . పండగలు, వివిధ రూపాల్లో భారీ ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఆ సంస్థ సీఈవో బన్సాల్ రాజీనామాతో సంస్థలో ఏం జరుగుతుందా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

- Advertisement -