తనను హత్య చేసేందుకు కుట్ర:అక్బర్

212
akbaruddin
- Advertisement -

మజ్లిస్ నేత, మాజీ ఎంఎల్ ఏ అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. యాకత్‌పురాలో ఓ సభలో మాట్లాడిన అక్బర్‌ తనను చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. అంతేగాదు అహ్మదాబాద్, కర్ణాటక నుండి 11మంది రంగంలోకి దిగారని ఒవైసీ తెలిపారు.

గతంలో చావు అంచులదాక వెళ్లి వచ్చానని బెదిరింపులకు లొంగిపోనని తెలిపారు. తనకు ప్రజలే రక్షణగా ఉన్నారని స్పష్టం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్బర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

గతంలో పాతబస్తీ బార్కస్ లో 2011 ఏప్రిల్ 30న అక్బరుద్దీన్ పై మహ్మద్ పహిల్వాన్ తో పాటు అతని అనుచరులు కత్తులు, పిస్టల్ తో దాడి చేశారు. ఈ దాడిలో అక్బరుద్దీన్ కు 5 కత్తి పోట్లు పడ్డయ్. మూడు బుల్లెట్లు శరీరంలోని వెళ్లాయి. దాడి చేసిన వారిని అడ్డుకునేందుకు గన్ మెన్ జానీమియా కాల్పుల్లో ఇబ్రహీం అనే యువకుడు చనిపోయిన విషయం తెలిసిందే.

- Advertisement -