ఇలయ దళపతి విజయ్, కీర్తి సరేష్ జంటగా మురుగదాస్ తెరకెక్కించిన సినిమా సర్కార్. ప్రస్తుతం ఈమూవీ తెలుగు, తమిళ్ లో బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈచిత్రంలో కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని అన్నాడీఎంకే పార్టీ అభ్యంతరాలు తెలిపింది. దింతో తమిళనాడులో ఈ సినిమాపై తీవ్ర దుమారం రేగింది.
సినిమాలో తమిళనాడు దివంగత సీఎం జయలలిత ప్రేవశపెట్టిన సంక్షేమ పథకాలపై విమర్శనాత్మకంగా ఉన్న సీన్లను తీసేయాలని మంత్రులు, అన్నాడీఎంకే నేతలు డిమాండ్ చేస్తున్నారు. సర్కార్ ఆడుతున్న థియేటర్ల దగ్గర అన్నాడీఎంకే శ్రేణులు ఆందోళనలు చేపడుతున్నాయి. దర్శకుడు మురుసదాస్ ను అరెస్ట్ చేసినట్టు కొన్ని వార్తలు వచ్చాయి.
ఈ మేరకు సర్కార్ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్’ ట్వీట్ చేసింది. దీంతో ఈ వ్యవహారంపై మురుగదాస్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘పోలీసులు నా ఇంటికి రాత్రిపూట వచ్చి తలుపులు చాలాసార్లు కొట్టారు. కానీ నేను ఇంటిలో లేకపోవడంతో వెళ్లిపోయారు. ఇప్పుడు నా ఇంటి ముందు పోలీస్ అధికారులెవరూ లేరు’ అని మురుగదాస్ నిన్న రాత్రి ట్వీట్ చేశారు