‘నెక్స్ట్ ఏంటి’టైటిల్ లోగో విడుద‌ల చేసిన రానా

284
next enti logo
- Advertisement -

మిల్కి బ్యూటి త‌మ‌న్నా సందీప్ కిష‌న్ జంట‌గా తెర‌కెక్కుతోన్న మూవీ నెక్స్ట్ ఏంటి. బాలీవుడ్ లో ‘ఫనా’, ‘హమ్ తుమ్’ లాంటి సూపర్ హిట్ చిత్రాలని తెరకెక్కించిన దర్శకుడు కునాల్ కోహ్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారి ఓ బాలీవుడ్ డైరెక్టర్ తెలుగు సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు.

net enti title logo

నవదీప్, పూనమ్ కౌర్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది.లియోన్ జేమ్స్ సంగీతం సమకూరుస్తుండగా, మనీష్ చంద్ర భట్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. రైనా జోషి, అక్షయ్ పూరి నిర్మిస్తున్న ఈ సినిమా ని డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారు.తాజాగా టైటిల్ లోగోతో కూడిన ఫస్టులుక్ ను రానా చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

త‌మ‌న్నా తెలుగులో సినిమాలు చేయ‌క చాలా రోజుల‌య్యింది. దీనికి కార‌ణం ఆమె పారితోష‌కం పెంచ‌డం ఒక కార‌ణ‌మైతే, కొత్త‌గా వ‌స్తున్న క‌థానాయిక‌ల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల ఆమెకు అవ‌కాశాలు త‌గ్గుముఖం ప‌ట్టాయి. అటు సందీప్ కిష‌న్ కు కూడా స‌రైన హిట్ లేక‌పోవ‌డంతో సత‌మ‌త‌మవుతున్నాడు. ఈసినిమా విజయం ఇద్ద‌రికి అవ‌స‌రం కావ‌డంతో మూవీపై భారీ ఆశ‌లు పెట్టుకున్నారు.

- Advertisement -