- Advertisement -
మంత్రి కేటీఆర్ చిన్నారులతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ సంస్ధకు చెందిన చిన్నారులతో సరదాగా గడిపి వాళ్లతో టపాసులు కాల్చారు. ఈసందర్భంగా చిన్నారులకు రూ. 12లక్షల రూపాయల చెక్కును విరాళంగా అందజేశారు. పిల్లలకు స్వీట్లు, పటాకులు పంచి.. వాళ్లలో ఉత్సాహాన్ని నింపారు.
పండగ పూట చిన్నారులతో గడపడం చాలా ఆనందంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. ఈ దీపావళి చిన్నారుల జీవితాల్లో ఎన్నో కాంతులు నింపాలని భగవంతున్ని ప్రార్ధించానని చెప్పారు. చాలా కాలం తర్వాత తన జీవితంలో ఇదే అత్యుత్తమ దీపావళి అని చెప్పారు. హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ సంస్థకు చెందిన చిన్నారులకు అందరూ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఎలాంటి అవసరమున్నా తనను సంప్రదించవచ్చని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
- Advertisement -