రాజమౌళి ‘RRR’కు ముహూర్తం ఖరారు..

198
SS Rajamouli
- Advertisement -

టాలీవుడ్‌ దర్శకదీరుడు ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్షన్‌లో అగ్రహీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. దీనికి RRR అని పేరు కూడా పెట్టారు. RRR.. అంటే రాజమౌళి, రామ్‌చరణ్, రామారావు. ఈ సినిమాకు వాళ్ల మొదటి అక్షరాలనే వర్కింగ్ టైటిల్‌గా పెట్టారు. ఇక ఈ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందో మాత్రం రాజమౌళి ప్రకటించలేదు. దీంతో అసలు ఈ సినిమా వస్తుందా.. రాదా.. అనే అనుమానం ప్రేక్షకులలో కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ.. ఈ మల్టీ స్టారర్ చిత్రం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది.

SS Rajamouli

ఈ విషయాన్ని డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ ఓ పోస్ట్ ద్వారా విడుదల చేసిన వీడియోలో తెలిపింది. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ఈ సినిమా ప్రారంభోత్సం ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలిపింది. కాగా, డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ను, విడుదల తేదీని ఈ సినిమా ప్రారంభం రోజునే ప్రకటిస్తారని సమాచారం. ఈ చిత్రంలో కీర్తి సురేశ్, రష్మిక, సమంతలను హీరోయిన్లుగా తీసుకోనున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి సంగీతం కీరవాణి అందించనుండగా, కెమెరామెన్ గా సెంథిల్ వ్యవహరించనున్నారు.

- Advertisement -