ఓ వైపు రఫెల్ స్కాం ఆరోపణలతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న మోడీ అండ్ కోకి మరో షాక్ తగలనుందా..?ఇంతకాలం మోడీకి మద్దతుగా నిలిచిన ఆయన సోదరుడు తిరుగుబాటు జెండా ఎగరవేయనున్నాడా..?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలో తృణమూల్ కాంగ్రెస్ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు ప్రహ్లాద్ మోడీ.
రేషన్ డీలర్ల జాతీయ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న ప్రహ్లాద్ మోడీ త్వరలో టీఎంసీలో చేరనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. 2019లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఆయన టీఎంసీ తరపున ప్రచారం చేస్తారని తెలిపారు.
గతంలో నకిలీ డిగ్రీ పొందినట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే జరిగిన ఓ ఆందోళన కార్యక్రమంలో ప్రహ్లాద్ పాల్గొని సంచలనం సృష్టించారు. తాజాగా ఈ సారి ఏకంగా మోడీని ఢికొట్టేందుకు మమతా సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్లో చేరుతుండటం బీజేపీపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని కాషాయ నేతలు తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది.