ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావుకు గుండెపోటు వచ్చింది. ఈ క్రమంలో అస్వస్థతకు గురైన ఆయనను హుటాహుటీన సిట్ బృందం కేజీహెచ్ ఆస్పత్రికి తరలించింది. శ్రీనివాసరావును పరీక్షించిన వైద్యులు, అతను గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. శ్రీనివాసరావు గుండెపోటుతో బాధపడుతున్నారని.. చికిత్సకు కూడా సహకరించడం లేదని వైద్యులు తెలిపారు.అయితే.. తనకు ట్రీట్‌మెంట్ వద్దని.. అవయవ దానం చేస్తానని శ్రీనివాసరావు అంటున్నట్లు వైద్యులు చెప్పారు. బీపీ, షుగర్ లెవల్స్ సాధారణంగా ఉన్నాయని.. తాను ప్రజలతో మాట్లాడాలని ఆసక్తిగా ఉన్నాడని పేర్కొన్నారు. అయితే ఆస్పత్రికి తీసుకువెళ్లే క్రమంలో తనకు ప్రాణ హాని ఉందని శ్రీనివాసరావు కేకలు పెట్టాడు. ప్రజలతో మాట్లాడేందుకు ఒకసారి అవకాశం ఇవ్వాలంటూ నిందితుడు వేడుకున్నాడు.విశాఖ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో సిట్ బృందం విచారిస్తున్న సందర్బంలో తన చేతుల్లో, ఛాతిలో నొప్పి ఉందని శ్రీనివాసరావు చెప్పడంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. మెరుగైన వైద్య సేవల నిమిత్తం కేజీహెచ్‌కు తరలిస్తుండగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.
జగన్ దాడి కేసులో నిందితుడికి గుండెపోటు..!
- Advertisement -
- Advertisement -