శబరిమల అందరిది..’షా’కు అంతసీన్ లేదు

229
pinarayi-vijayan
- Advertisement -

శబరిమల ప్రతి ఒక్కరిదని స్పష్టం చేసింది కేరళ హైకోర్టు. అయ్యప్ప ఆలయంలోకి హిందూయేతరులను అనుమతించవద్దని బీజేపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం అనుసరించే మతంతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికి శబరిమల ఆలయంలో ప్రార్థన చేసే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది.

ఇరుముడి లేకుండా ఆలయంలోకి వెళ్లకుండా చూడాలన్న అభ్యర్థననూ న్యాయస్ధానం తోసిపుచ్చింది. ఇలాంటి నిబంధన ఏమీ ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డులో లేదని ..18 మెట్ల మీదుగా వెళ్లాలనుకునే వారికి మాత్రమే ఇరుముడి అవసరమని చెప్పింది. ఆలయంలోకి హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తే శబరిమలలో మతాలకు అతీతంగా ఉన్న వాతావరణం దెబ్బతింటుందని తెలిపింది న్యాయస్థానం.

మరోవైపు కేరళ సీఎం పినరయి విజయన్ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవించాలని సూచించారు. సుప్రీంకోర్టునే బెదిరించేందుకు అమిత్ షాకు ఎన్ని గుండెలు? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేరళలో వామపక్ష ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమిత్ షా కుట్రలు చేస్తున్నారని… ఆయనకు ఉన్న బలం దానికి సరిపోదని విజయన్ వ్యాఖ్యానించారు.

- Advertisement -