నవంబర్‌ 6న టీఆర్ఎస్‌ మేనిఫెస్టో..!

223
Telanga Manifesto
- Advertisement -

ఓ వైపు తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకోగా ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రజలను ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఇక ఎన్నికల ప్రచారంలో ముందున్న టీఆర్ఎస్..మేనిఫెస్టో రూపకల్పనలోనూ ముందే ఉంది. ఇప్పటికే పాక్షిక మేనిఫెస్టోను విడుదల చేసిన సీఎం కేసీఆర్ 8 హామీలను ప్రకటించారు.

కేశవరావు నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ తుది మెరుగులు దిద్దింది. నవంబర్ 6న టీఆర్ఎస్ పూర్తిస్థాయి మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కీలకమైన హామీలతో పాటు, భారీ సంఖ్యలో కొత్త ప్రతిపాదనలు తుది మ్యానిఫెస్టోలో ఉండేలా ఆ పార్టీ ఎన్నికల కమిటీ కసరత్తు చేస్తున్నారు.

ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన దళిత, గిరిజనుల కోసం హామీల రూపకల్పనపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. నవంబరు 3 కల్లా అన్ని కమిటీలు తమ నివేదికలను సిద్ధం చేసి సీఎం కేసీఆర్‌కు సమర్పించనున్నాయి. సీఎం కేసీఆర్ సూచనలతో మార్పులు,చేర్పులు చేసిన అనంతరం ప్రజల ముందుకు మేనిఫెస్టోను తీసుకురానున్నారు. 6 కేసీఆర్ లక్కీ నెంబర్ కావడంతో అదే రోజు మేనిఫెస్టో ప్రకటించనున్నట్లు సమాచారం.

ఇప్పటికే ప్రకటించిన హామీల్లో గతంలో లాగే ఈ సారికూడా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ ,రైతు బంధు కింద ఎకరానికి రూ. 10వేలు ఇస్తామన్నారు. రైతు సమన్వయ సమితిలకు గౌరవ భృతి,57 ఏళ్లు దాటినవారందరికీ పెన్షన్లు ఇస్తామని ప్రకటించారు. ఆసరా పెన్షన్ల కింద వృద్దులకు రూ, 2, 016, వికలాంగుకు రూ.3,016, నిరుద్యోగ భృతి రూ. 3,016 ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -