ఎన్టీఆర్ బయోపిక్‌..చైతన్య రథం రెడీ..!

951
ntr biopic
- Advertisement -

నందమూరి బాలకృష్ణ-క్రిష్ కాంబినేషన్‌లో శరవేగంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. జనవరి 9న ఎన్టీఆర్ సినిమా నేపథ్యంలో కథానాయకుడు,జనవరి 24న రాజకీయ నేపథ్యంలో మహానాయకుడు ప్రేక్షకుల ముందుకురానుంది.

N.T. Rama Rao campaigning on his ‘Chaitanya ratham.’

ఇప్పటివరకు ఎన్టీఆర్ సినిమాలో నటిస్తున్న పాత్రలను రివీల్ చేస్తూ అందరిని ఆకర్షించింది చిత్రయూనిట్. తాజాగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ప్రత్యేకంగా తయారు చేయించిన చైతన్య రథంతో రాష్ట్రమంతటా పర్యటించారు. ఎన్టీఆర్ ప్రచార రథానికి సారధిగా హరికృష్ణ వ్యవహరించగా మహానాయకుడు సినిమాలో  కళ్యాణ్ రామ్ సారథిగా కనిపించనున్నారు.

దీనిపైనే ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న బాలకృష్ణ ఎన్నికల ప్రచార పర్వానికి సంబంధించిన షూటింగ్ ను చేయనున్నారు. ఇప్పుడు ఈ చైతన్య రథం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ సినిమాలో విద్యాబాలన్,రానా,కళ్యాణ్ రామ్,కైకాల,రకుల్,జయప్రద,ఆమని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisement -