డిసెంబర్‌ 14న అమర్ అక్బర్ అంటోని..

275
ravi teja
- Advertisement -

మాస్‌ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అమర్‌ అక్బర్ ఆంటోనీ’. కామెడీ చిత్రాలకు కేరాఫ్‌ శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ.. అమర్‌, అక్బర్, ఆంటోనీగా త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఒకప్పుడు వరుస విజయాలను అందించిన శ్రీను వైట్ల .. ఆ తరువాత వరుస పరాజయాలను ఎదుర్కుంటూ వస్తున్నాడు. ఈసారి
తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో రవితేజతో ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా చేస్తున్నాడు.

తొలుత అక్టోబర్‌ 5న సినిమా విడుదలవుతుందని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించినప్పటికి అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. డిసెంబర్‌ 14న సినిమా విడుదల కానుందని ప్రకటించారు చిత్ర నిర్మాతలు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా టీజర్ ను ఈ నెల 29న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -