టాలీవుడ్ నటుడు,దర్శకుడు రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజాగా చిత్రం ‘అదుగో’ ఈ మూవీలో ‘పందిపిల్ల’ ప్రధాన పాత్రలో కనబడనుంది. పూర్తి వినోదభరితంగా నిర్మితమైన ఈ సినిమా రిలీజ్ తేదీ ఖరారైంది. నవంబర్ 7న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. తన స్వంత నిర్మాణ సంస్థ ఫ్లెయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై రవిబాబు నిర్మిస్తున్నారు.

రవిబాబుతో పాటు ఈ చిత్రంలో అభిషేక్ వర్మ, నభా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్ ను చూపిస్తోన్న సినిమా ఇది. ఇందులో పందిపిల్లను చాలా రియల్ గా చూపించే ప్రయత్నం చేసారు గ్రాఫిక్స్ టీం. దీనికోసం చాలా విజువల్ ఎఫెక్ట్స్ కూడా వాడుకున్నారు రవిబాబు.
ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తుండగా.. ఎన్ సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అదుగో అన్ని భారతీయ భాషల్లో విడుదల అవుతుండటం విశేషం. ఇటీవల కొన్ని ప్రమోషనల్ వీడియోలు విడుదల కాగా, వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి పందిపిల్లతో రవిబాబు చేయించిన మ్యాజిక్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో తెలియాంటే దీవాళి వరకు ఆగాల్సిందే.

