తమిళ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న మహానాయకురాలు అమ్మ జయలలిత.ఎంజీఆర్,కరుణానిధి తర్వాత అంతటి ఇమేజ్ సంపాదించుకున్న జయ…అమ్మగా ప్రజల్లో చెరగని స్ధానాన్ని సంపాదించుకున్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మరింతగా చేరువైన జయలలిత దశాబ్దాల పాటు తమిళరాజకీయాలను శాసించింది.
జయలలిత మరణం తర్వాత ఆమె బయోపిక్ తెరకెక్కించనున్నట్లు చాలామంది దర్శకులు ప్రకటించారు. అయితే చాలామంది కేవలం ప్రకటనలతోనే సరిపెట్టగా దర్శకురాలు ప్రియదర్శని మాత్రం ఏకంగా ఫస్ట్ లుక్‌తో ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇందులో నిత్యామీనన్ జాయతలిత పాత్రలో నటిస్తుందట.
దర్శకుడు లింగుస్వామి కూడా జయలలిత బయోపిక్ ను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇందులో జయలలిత పాత్రకోసం లేడీ సూపర్ స్టార్ నయనతారను తీసుకున్నట్టుగా తెలుస్తున్నది. మరో దర్శకుడు ఏఎల్ విజయ్ జయలలిత బయోపిక్ ను తీసేందుకు సిద్దమయ్యాడు. ఇందులో విద్యాబాలన్ ను జయలలిత పాత్రకోసం ఎంపిక చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ ను నిర్మిస్తున్న నిర్మాతల్లో ఒకరైన విష్ణు ఇందూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మొత్తంగా అమ్మ జయలలిత బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాల్లో కరుణానిధి పాత్ర ఎవరు పోషిస్తారో అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది.