క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన బ్రావో..

223
bravo
- Advertisement -

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు విండీస్ ఆల్‌రౌండ‌ర్ డ్వెయిన్ బ్రావో. అన్ని ఫార్మాట్ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. విండీస్ బోర్డుతో విభేదాల కార‌ణంగా కొంత‌కాలంగా జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించ‌ని బ్రావో 14 ఏళ్ల కెరీర్‌కు గుడ్ డై చెప్పాడు.

2004లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన బ్రావో ఆ జ‌ట్టు విజ‌యాల్లో కీల‌కపాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో ధోని సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. త‌న ఆల్‌రౌండ్ ప్ర‌తిభ‌తో చెన్నై ప‌లుమార్లు ఐపీఎల్ క‌ప్ గెల‌వ‌డంలో కీ రోల్ పోషించాడు.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 40 టెస్టులు, 164 వన్డేలు, 66 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. విండీస్ తరపున తన చివరి వన్డేను రెండేళ్ల క్రితం ఆడాడు. బ్రావో టెస్టుల్లో మొత్తం 2200 పరుగులు చేసి 86 వికెట్లు తీసుకున్నాడు. ఇక వన్డేల్లో 2968 రన్స్ చేసి 199 వికెట్లు తీసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 1142 రన్స్ చేసి 52 వికెట్లు తీశాడు. ఇన్నాళ్లూ తన సక్సెస్‌లో భాగమైన ప్రతి ఒకరికి బ్రావో ధన్యవాదాలు తెలిపాడు బ్రావో.

- Advertisement -