సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. జగిత్యాల జిల్లా మేడిపల్లిలో ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేటీఆర్ ప్రజల మద్దతుతో తెలంగాణ సాధించామని చెప్పారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేదిశగా కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. బంగారు తెలంగాణ కావాలంటే బలమైన పునాది పడాల్సిన అవసరం ఉందన్నారు.
నాడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే అంధకారం అవుతుందని మాట్లాడారని కానీ అనతికాలంలోనే 24 గంటల పాటు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. నాడు కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదని ఎంతోమంది రైతులు రాత్రిపూట కరెంట్‌తో చనిపోయారని గుర్తుచేశారు. నేడు పక్కరాష్ట్రాలకు విద్యుత్ అందించే స్ధాయికి తెలంగాణ ఎదిగిందన్నారు.
కాంగ్రెస్ నేతల మాటలు నమ్మితే ఆగమైతమన్నారు కేటీఆర్. కరెంట్ బాగు చేసుకున్నామని తెలంగాణ ఉద్యమ నినాదం సాగునీటి కోసం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామన్నారు. తలపున గోదావరి పారుతుంటే కాంగ్రెస్ నేతలు చుక్క నీరివ్వలేదని ఆరోపించారు. కాళేశ్వరం,సీతారామ ప్రాజెక్టులతో తెలంగాణ సస్యశ్యామలంగా మారనుందని తెలిపారు. కాలంతో పోటీపడుతు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందన్నారు. మడిపల్లి,కత్లాపూర్ మరో కోనసీమగా మారబోతున్నాయని తెలిపారు.
తాగునీటికి ఇబ్బంది ఉండకూడదని మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టామన్నారు. ఎన్నికలు వచ్చేనాటికి మిషన్ భగీరథ పూర్తవుతుందని తెలిపారు. తెలంగాణలో పేదవాళ్లు సంతోషంగా ఉండాలన్నదే కేసీఆర్ అభిమతమన్నారు. పేదవారి కన్నీటి నుండి పుట్టినరాష్ట్రం తెలంగాణ అన్నారు. కేసీఆర్ పేదల పక్షపాతి అని విద్యార్థులకు సన్నబియ్యం,కల్యాణలక్ష్మీ,షాది ముబారక్,ఫించన్లు అందిస్తున్నారని చెప్పారు.
బిడీ కార్మికుల గురించి సమైక్యపాలకులు పట్టించుకోలేదని వారి సంక్షేమం కోసం వెయిరూపాయల ఫించన్ అందించారని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బిడీ కార్మికుల ఫించన్ వెయి నుంచి రెండు వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు కేటీఆర్.
కాంగ్రెస్ పాలనలో ప్రజలు అగచాట్లు పడ్డారని తెలిపారు కేటీఆర్. ఎరువుల కోసం రైతులు లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. కొంతమంది రైతులు లైన్లలో చనిపోయిన పరిస్థితి ఉండేదని కానీ నేడు ఆ పరిస్థితి మారిందన్నారు. సమయానికి ఎరువులు,విత్తనాలు అందిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. 17 వేల కోట్ల రుణమాఫీ చేశామని గుర్తుచేశారు కేటీఆర్.
రైతుల గురించి నిరంతం ఆలోచించే కేసీఆర్ రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఎకరానికి 4 వేల పెట్టుబడి అందిస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే లక్ష రుపాయల రుణమాఫీ చేస్తామని,రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు రెండు పంటలకు 10 వేలు అందిస్తామని ప్రకటించారు.