మీ నాయకుడిని మీరే కనిపెట్టండి…

293
sarkar official teaser
- Advertisement -

తమిళ స్టార్ విజయ్ నటించిన చిత్రం సర్కార్ టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. తమిళ్‌లో విడుదలైన 35 నిమిషాల్లోనే ఏకంగా 30 లక్షల వ్యూస్ రాగా.. 16 గంటల్లో 11 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సంపాదించుకుని రికార్డు సృష్టించింది. ట్విట్టర్‌లో సర్కార్‌ టీజర్‌ నెంబర్ వన్ ట్రెండింగ్‌లో నిలిచింది.

తాజాగా తెలుగులో సర్కార్‌ టీజర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. విడుదలైన కొద్ది గంటల్లోనే 11 లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోంది. వరలక్ష్మి వాయిస్‌తో ప్రారంభమైన ఈ టీజర్‌లో ‘వాడొక కార్పోరేట్ రాక్షసుడు ఏ దేశానికి వెళ్లినా వాళ్లని నాశనం చేసే వెళ్తాడు.. వాడు ఇప్పుడు ఇండియా వచ్చాడు’ . ‘నేను ఏ కంపెనీని కొనడానికి రాలేదు. ఈ రోజు ఎలక్షన్ డే కదా నేను నా ఓటు వేయడానికి వచ్చాను’ అంటూ వేలు చూపించడం .. నేనో కార్పోరేట్ క్రిమినల్‌ని , మీ ఊరి నాయకుడ్ని మీరే కనిపెట్టండి ఇదే మన ‘సర్కార్’ లాంటి పొలిటికల్ డైలాగ్‌లతో అంచనాలు పెంచేశాడు విజయ్‌.

న‌వంబ‌ర్ 6న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందించాడు.

- Advertisement -