బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. గతంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టి ఇతర స్టార్స్‌కు ఆదర్శంగా నిలిచిన మెగాస్టార్ అమితా బచ్చన్ తాజాగా రైతుల పక్షాన నిల్చునేందుకు ముందుకు వచ్చారు. ఈసారి ఆయన చేపట్టిన కార్యక్రమం అందరికి ఆదర్శనీయంగా నిలవడంతో పాటు షాకింగ్‌గా కూడా అనిపిస్తోంది. తాజాగా ఉత్తర ప్రదేశ్‌కి చెందిన 850కి పైగా రైతుల రుణాలని తీరుస్తానని అమితాబ్ అన్నారు.
గతంలో మహారాష్ట్రకి చెందిన 350 మంది రైతుల లోన్స్‌ని బిగ్ బీ మాఫీ చేసిన సంగతి తెలిసిందే. రైతుల గురించి మాట్లాడిన అమితాబ్ మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్న రైతులని ఆదుకోవడం చాలా ఆనందంగా ఉంది. గతంలో ఆంధ్ర, విదర్భ ప్రాంతాలకి చెందిన రైతుల రుణాలు మాఫీ చేశాను. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ రైతుల రుణాలు మాఫీ చేయబోతున్నాను. 5.5 కోట్ల రూపాయలని వారికి చెల్లించి వారి జీవితాలని పునర్నిర్మాణం చేయాలని భావిస్తున్నాను అంటూ అమితాబ్ బ్లాగ్‌లో తెలిపారు.
అంతేకాదు బలవంతంగా వ్యభిచార గృహాల్లోకి నెట్టి వారి జీవితాన్ని చిన్నా భిన్నం చేసే వారి నుండి యువతులని రక్షించి వారి కోసం పాటు పడుతున్న అజీత్ సింగ్‌కి కూడా కొంత మొత్తం ఇవ్వనున్నట్టు అమితాబ్ తెలిపారు. అమితాయ్ చేసిన పోస్ట్‌తో ఇతర స్టార్స్ కూడా రైతులకు సాయం చేసేందుకు ముందుకు రావాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ కోరుకుంటున్నారు.