మళ్లీ దొరికిన చంద్రబాబు… డబ్బు తరలిస్తూ పట్టుబడ్డ టీడీపీ నేత

216
telugu-yuvatha
- Advertisement -

మరోసారి చంద్రబాబు నాయుడు దొంగ బుద్ది బయటపడింది. ఇది వరకే ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు తన తీరు మార్చుకోకుండా మరోసారి అదే తప్పు చేసి పోలీసులకు మళ్లీ దొరికాడు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డిని బలిపశువును చేసిన చంద్రబాబు ఈ సారి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌ను అడ్డంగా వాడుకున్నాడు.

 telugu-yuvatha

చంద్రబాబు డైరెక్షన్‌లోనే వల్లభనేని అనిల్‌ హవాలా ద్వారా హైదరాబాద్‌ నుంచి జగిత్యాలకు రూ. 60 లక్షల నగదును తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మొత్తం ఈ కేసులో ఐదుగురిని నిందితులుగా గుర్తించారు పోలీసులు. నగదుతో పాటు అనిల్‌కు చెందిన ఏపీ 09 సీఎఫ్‌ 1144 నంబర్‌గల వెర్నా కారు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డబ్బుపై నిందితుడు అనిల్‌ లెక్కలు చూపకపోవడంతో పోలీసులు విచారణ కోసం ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. అనిల్‌ ఈ డబ్బును ఎన్నికల కోసం తరలిస్తున్నారా..? లేక మరేదైనా అక్రమ కార్యకలాపాల కోసం తరలిస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. ఈ కోణంలోనే పోలీసులు విచారణ చేస్తున్నారు.

telugu-yuvatha

ఈ కేసు దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డబ్బులతో అడ్డంగా దొరికిన తెలుగు యువత అధ్యక్షుడు అనిల్‌ అతి సాధారణ కుటుంబం నుంచి సినిమా అక్రమ సంపాదనతో కోట్లకు పడగలెత్తినట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన అనిల్‌ టీడీపీ తరుపున 2009, 2014 ఎన్నికల్లో నందిగామలో ప్రచారం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా టీడీపీ బడా నేతలతో అనిల్‌ సంబంధాలున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు.

telugu-yuvatha

సినిమా పరిశ్రమలో లైట్‌ బాయ్‌గా చేరిన అనిల్‌ తర్వాత నెమ్మదిగా సినిమా పరిశ్రమలో తప్పుడు సభ్యత్వం తీసుకుని చిత్రపురికాలనీలో సినిమా కార్మికులకు రావాల్సిన ఫ్లాట్లను కబ్జా చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అనిల్‌కు చంద్రబాబు, ఎల్‌ రమణలతో సత్సంబంధాలు ఉన్నాయి. మహాకూటమి తెరపైకి వచ్చినప్పటినుంచి అనిల్‌ కాంగ్రెస్‌ నాయకులతో కూడా టచ్‌లో ఉంటున్నాడు. చంద్రబాబు తరుపున అనిల్‌ తెలంగాణలో పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నాడు.

- Advertisement -