సక్సెస్ తో సంబంధం లేకుండా.. విభిన్నమైన్న పాత్రలు చేస్తూ హీరో నారా రోహిత్ దూసుకుపోతున్నాడు. ఇప్పటి వరకు చేసిన సినిమాలకు ఆశించినంత ఫలితం రాకపోయినా.. ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ముందుకెళ్తున్నాడు. తాజాగా “వీర భోగ వసంత రాయలు” అనే మూవీతో మరోసారి పేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో శ్రియ, శ్రీ విష్ణు, సుధీర్ బాబు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
ఇంద్రసేన దర్శకత్వంలో బాబా క్రియేషన్స్ పతాకంపై అప్పారావు బెళ్లన నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఆడపిల్లలపై జరుగుతున్న దాడుల సన్నివేశాలతో ఈ ట్రైలర్ మొదలైంది. హైజాకర్స్ కొందరు ఫ్లైట్ ను హైజాక్ చేయగా.. వారి వద్ద నుంచి ప్రయాణికులకు తప్పించే క్రమంలో మన హీరోలు చేసే ఆపరేషన్ ను మూవీలో ఆసక్తికరంగా రూపొందించారు. ఈ నెల 26న విడుదల వీర భోగ వసంత రాయలు అభిమానుల ముందుకు రానునుంది.
నారా రోహిత్, శ్రీయ సీబీఐ ఆఫీసర్స్ పాత్రలో నటిస్తున్నారు. గొడవలు, హత్యల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రంతో నారా రోహిత్ హిట్ కొడతాడో లేదో వేచిచూడాలి.
https://youtu.be/KT6875hyV1U