మీటు ఎఫెక్ట్ ఇండియాను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీపై దీని ప్రభావం అధికంగా ఉంది. ఇప్పటికే ఈ మీటు ప్రభావంతో.. అనేక మంది స్టార్ సెలెబ్రిటీల జీవితం అయోమయంలో పడిపోయింది. సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఒక సినిమా హిట్ కావాలి అంటే.. సాధారణ ప్రేక్షకుకు కోరుకునే అన్ని అంశాలు సినిమాలో ఉండాలి. ముఖ్యంగా హీరోయిన్లను గ్లామర్‌గా చూపించాలి. ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి.
అయితే ఇప్పుడు ఐటమ్ సాంగ్స్‌పై కూడా మీ టూ ప్రభావం పడింది. ఇండియన్ సగటు సినిమా ఫార్మూలాలో పాటలతోపాటు ఐటమ్ సాంగ్స్ కూడా అనివార్యం. కథతో, దాని నేపథ్యంతో సంబంధం లేకుండా.. అసందర్భంగా.. కేవలం.. ప్రేక్షకులకు (మేల్) కిక్ ఇవ్వడానికి మాత్రమే ఉంటాయీ సాంగ్స్. జనాల్లో ఆ పాటలు ఎంత పాపులరో.. ఐటమ్ గర్ల్స్‌కీ అంత క్రేజ్. శరీర వర్ణన.. శృంగార రస ప్రాధాన్యంగానే ఈ పాటలు సాగుతాయి.
అలాంటిది సినిమాలో గ్లామర్ లోపిస్తే.. సినిమా ఢమాల్ అంటుంది. మీటు ఎఫెక్ట్ వలన ఇప్పుడు అదే జరిగేటట్టుగా ఉన్నది. ఐటమ్ సాంగ్స్ ఉంటె ఏం గొడవలు వస్తాయో.. అని భయపడిపోతున్నారు. ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్ తన పటాకా సినిమాలో హెలో హెలో అనే ఐటమ్ సాంగ్ ను చిత్రీకరణ చేశారు. మలైకా అరోరాపై చిత్రికరించిన ఈ సాంగ్ బాగా వచ్చిందట. మీటు ఎఫెక్ట్‌కు భయపడిన దర్శకనిర్మాతలు ఎందుకు వచ్చిన గొడవలే అనుకోని సాంగ్ ను సినిమా నుంచి తొలగించారట. మరి ఈ మీ టూ ప్రభావం ఎంతవరకు కొన్నసాగుంతుందో చూడాలి.