మీ టూ ఉద్యమానికి బిగ్‌ బీ మద్దతు….

252
- Advertisement -

మీ టూ ఉద్యమానికి అమితాబచ్చన్ మద్దతు పలికారు. పుట్టినరోజు సందర్భంగా స్పందించిన అమితాబచ్చన్ .ఏ మహిళ పట్ల ఎవరూ అసభ్యంగా ప్రవర్తించకూడదు అని అమితాబచ్చన్ అన్నారు. మహిళలు పనిచేసే ప్రాంతంలో అస్సలు ఇబ్బందిపెట్టకూడదు ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే వెంటనే అక్కడి అథారిటీ దృష్టికి తీసుకెళ్లాలి అని చెప్పారు. పరిస్థితిని వాళ్లు వెంటనే సరిదిద్దాలి అని అన్నారు. అప్పుడే వెళ్లి చట్టపరమైన యాక్షన్ తీసుకునేలా ఓ కంప్లయింట్ ఐనా ఇవ్వాలి అని అమితాబచ్చన్ అన్నారు. ఏ మహిళ కూడా పనిచేసే చోట ఇబ్బంది పడకూడదని ఆయన అన్నారు.

Amitabh Bachchan

“మీ టూ” అంటూ తమ ఆవేదన చెబుతున్న వారికి మితాబ్ సపోర్ట్ ఇచ్చారు. మీ టూ మూవ్ మెంట్ కు మద్దతిచ్చిన సెలబ్రిటీల లిస్టులో అమితాబచ్చన్ చేరిపోయారు. ప్రముఖంగా బాలీవుడ్ లో మీ టూ ఉద్యమం వేడెక్కుతోంది. ఆ మధ్య కంగనా రనౌత్ మొదలుపెడితే. తాజాగా తనుశ్రీదత్తా ఆరోపణలు బాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. బాలీవుడ్ లోని పెద్ద పెద్ద వాళ్ల పేర్లు వేధింపుల లిస్టులో చేరిపోతున్నాయి.

ఈ పరిస్థితుల్లోనే బిగ్ బీ అమితాబచ్చన్. వేధింపులకు వ్యతిరేకంగా తన ఒపీనియన్ వివరించారు. చదువుకునే వయసులోనే పిల్లలకు సంస్కారం, క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పాల్సిన అవసరం ఉందని బిగ్ బీ అమితాబచ్చన్ అభిప్రాయపడ్డారు. ఆడపిల్లలు, పేదలను మన సమాజం పట్టించుకోదని. వారిని ప్రత్యేకమైన భద్రత కల్పిస్తూ రక్షించాల్సిన అవసరం ఉందన్నారు.

- Advertisement -