కాంగ్రెస్‌కు షాక్..బీజేపీలోకి దామోదర సతీమణి

239
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఉప ముఖ్యమంత్రి,కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీరెడ్డి బీజేపీలో చేరింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ..పద్మినీ రెడ్డికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

గజ్వేల్ ప్రచారానికి బయలుదేరిన రాజనర్సింహ విషయం తెలుసుకుని షాక్ కు గురయ్యారు. ఇప్పటికే గందరగోళంలో ఉన్న హస్తం పార్టీకి ఇది గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీనియర్ లీడర్ రాజనర్సింహా సొంతింట్లోనే వేరు కుంపటి పెట్టడంతో కాంగ్రెస్ పరిస్థితి మరింత అయోమయంగా మారింది. ఊహించని పరిణామంతో పార్టీకి సమాధానం చెప్పుకోలేని స్థితిలో దామోదర ఉన్నారు.

ప్రస్తుతం అందోల్ నుంచి బరిలోకి దిగనున్న దామోదర… బీజేపీ అభ్యర్థి బాబు మోహన్ తో తలపడే అవకాశం ఉంది.  ఈ నేపథ్యంలో ఆయన సతీమణి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -