టీఆర్ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి…

516
harish etela
- Advertisement -

తెలంగాణ అభివృద్ది ముందుకుసాగాలంటే టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావాలన్నారు మంత్రులు హరీశ్ రావు,ఈటల రాజేందర్. సిద్దిపేట,హుజురాబాద్‌ జిల్లాల్లో వేర్వేరుగా ప్రచారం నిర్వహించిన హరీష్,ఈటల మహాకూటమితో టీఆర్ఎస్‌ గెలుపును ఆపలేరన్నారు.

సిద్దిపేట జిల్ల జగదేవ్‌ పూర్‌లో ఎంపీ ప్రభాకర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్ కాంగ్రెస్‌ వైఖరిని ఎండగట్టారు. వచ్చే ఆరు నెలల్లో సాగుకు గోదావరి జలాలు అందుతాయని తెలిపారు. బతుకమ్మ చీరల అడ్డుకున్న కాంగ్రెస్‌కు మహిళలు ఓటుతో బుద్ది చెప్పాలని కోరారు. రాష్ట్ర అభివృద్ది సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు
బతుకమ్మలతో భారీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

హుజూరాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ అని స్పష్టం చేశారు మంత్రి ఈటల రాజేందర్ . హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల…ఉద్యమం నుంచి నేటి వరకు ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తున్నానని తెలిపారు. మహాకూటమి నేతలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని స్పష్టం చేశారు.

- Advertisement -