తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ..

217
Venkaiah
- Advertisement -

బతుకమ్మ పండుగలో గొప్ప సందేశముందని….తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ అని తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. వరంగల్‌ నిట్‌ స్ధాపించి 60 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా డైమండ్ జూబ్లీ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ప్రపంచం మొత్తం భారత్ వైపే చూస్తోందని ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ స్థాయి కంపెనీలు పోటీపడుతున్నాయని తెలిపారు.ప్రజల పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని…భవిష్యత్ తరాల కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేయాలన్నారు. మెరుగైన వసతులు కల్పించేందుకు పన్నులు వసూలు చేయడం తప్పనిసరని వెంకయ్య అన్నారు.

పన్నుల వసూళ్లకు అధునాతన టెక్నాలజీని ఉపయోగించాలని కోరారు. స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు దాటిన ఇంకా 20 శాతం మంది ప్రజలు పేదరికంలో ఉన్నారని చెప్పారు.జీఎస్టీ, నోట్ల రద్దు వంటి వాటిని ప్రతిపక్షాలు విమర్శించాయని, అయితే సంస్కరణల ఫలితం వెంటనే కనిపించదని అన్నారు. సంస్కరణల ఫలితాలు భవిష్యత్‌లో అద్భుతంగా ఉంటాయని పేర్కొన్నారు. బీఫ్ ఫెస్టివల్‌ను బలవంతంగా ఇతరులపై రుద్దకూడదన్నారు. మాతృభాష కళ్లు అయితే.. అన్యభాషలు కళ్ల అద్దాల వంటివని వెంకయ్య అభిప్రాయపడ్డారు.

- Advertisement -