తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డిలపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. వారు ఓ చేతకాని దద్దమ్మలు అంటూ కడిగిపారేశారు. ఇవాళ నల్గొండ జిల్లాలో జరిగిన టీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే జానారెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణపై ప్రేమ లేదని, జానారెడ్డి, కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి హాయాంలో తెలంగాణ ఉద్యమం అన్నాడని, కానీ విజయభాస్కర్ రెడ్డి మంత్రి పదవి ఇయ్యంగనే తెలంగాణ ఉద్యమాన్ని మర్చిపోయిండని ఎద్దేవా చేశారు సీఎం కేసీఆర్.
జానారెడ్డి లాబీలు, ఫైరవీల కోసమే ఉద్యమం చేశారని నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్. పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమి తెల్వదని, తాము కోటి ఎకరాలకు నీళ్లిచ్చేవిధంగా ప్రాజెక్టులను రీడిజైన్ చేశామని, తాను అసెంబ్లీలో ప్రాజెక్టుల రీడిజైన్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే కాంగ్రెస్‌కు ఏం అర్ధం కాక బాయ్ కాట్ చేసి పారిపోయిందని, కాంగ్రెస్ నాయకులకు అసలు పాలన గురించే తెలియదని, తాను చేసిన ప్రజెంటేషన్‌లో ఏమన్నా తప్పులు ఉంటే అప్పుడే చెప్పాలని కానీ ఎందుకు పారిపోయారో ప్రలజకు చెప్పాలని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు ఏనాడు నల్గొండలో పవర్‌ప్లాంట్ పెట్టాలనే ఆలోచన రాలేదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దామరచర్లలో 4వేల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను కడుతున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు కండ్లమంటతో కోర్టులో కేసులు వేసి అభివృద్ధికి అడ్డుపడుతున్నారని తీవ్ర స్ధాయిలో దుమ్మెత్తిపోశారు సీఎం కేసీఆర్.