- Advertisement -
సునామీ-భూకంపం ఏకకాలంలో విసిరిన పంజాకు ఇండోనేసియాలోని పాలూ నగరం అతలాకుతలమవుతోంది. ప్రకృతి ప్రకోపానికి గురైన ఈ నగరంలోని పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. నాలుగురోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. తొలుత 48మంది మాత్రమే మృతి చెందారని తెలుపగా గత నాలుగు రోజులుగా మృతుల సంఖ్య భారీగా పెరిగింది.
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ప్రస్తుతం 1,234కి చేరింది. అయితే తాజాగా ఓ చర్చిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 34 మంది విద్యార్థులు మృతి చెందారు. గుట్టగుట్టలుగా పడి ఉన్న మృతదేహాలను అక్కడి అధికారులు గుర్తించారు. మొత్తం 52 మంది తప్పిపోయినట్లు సమాచారం సేకరించారు. శిథిలాల కింద ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
- Advertisement -