తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు అన్ని అనుకూలంగా ఉన్నాయని…మిగితా రాష్ట్రాలతో పోలీస్తే బెటరని చెప్పారు ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ అన్నారు. రంగారెడ్డి జిల్లాలో వీవీ ప్యాట్ మిషన్ల పనితీరు పరిశీలించిన అనంతరం మాట్లాడిన కేటీఆర్ ఫామ్ 6 ద్వారా 19.5 లక్షల కొత్త ఓటర్లు అప్లై చేశారని….1.5 లక్షల ఓటర్లను రిజెక్ట్ చేశామన్నారు.
కొత్తగా నమోదు అయిన ఓటర్లకు అవసరమైన పక్షంలో అదనపు పోలింగ్ స్టేషన్ లకు ఈవీఎంలు, సిద్ధంగా ఉన్నాయి. భేల్ కంపెనీ 100 అదనపు పోలింగ్ స్టేషన్లకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నాఉ. ఇఆర్వో నెట్ చాలా స్పీడ్ గా పనిచేస్తుందని…నియోజక వర్గం వారిగా ఓటర్ లిస్ట్‌ను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎన్నికల కమిషన్ పారదర్శకంగా పనిచేస్తుందని చెప్పారు.
ప్రతి నియోజకవర్గంలో 13 శాతం కొత్త ఓటర్ లు పెరిగారని… కానీ భద్రాచలం లో 40 శాతం ఓటర్లు తగ్గారు,అశ్వారావుపేట లో 21 శాతం ఓటర్లు తగ్గారని చెప్పారు.రైతు బంధు, బతుకమ్మ చీరెల పంపిణీ పై వివిధ పార్టీల వారు అభ్యంతరాలు ఇచ్చారని వాటిని కేంద్ర ఎన్నికల కమిషన్ పంపించామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 4.16 లక్షల దివ్యాంగులు ఓటర్లుగా ఉన్నారని… వారికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దివ్యాంగులకు రవాణా, క్యూ లేకుండా చూస్తాం. వారికి తెలుగులో బోర్డ్స్ ఏర్పాటు చేస్తున్నామని..కళ్లు లేని వారి బ్రెయిలీ లిపిలో ఓటర్ కార్డు ఇచ్చేందుకు పరిశీలిస్తున్నామని చెప్పారు. శాంతి భద్రతల కోసం అడిషనల్ డిజిని కేంద్ర ఎన్నికల కమిషన్ సంఘం ఏర్పాటు చేసిందని ఆయన అన్ని చూస్తారని చెప్పారు.