నా కూతురు లేచిపోయింది..

341
rajendhraprasad
- Advertisement -

హాస్యానికి హీరోయిజాన్ని తెచ్చిపెట్టిన నటుడు రాజేంద్రప్రసాద్‌. హాస్య నటులు, క్యారెక్టర్‌ నటులు మాత్రమే హాస్యం పండిస్తున్న రోజుల్లో… హీరో కూడా నవ్వించగలడని, రెండు గంటలపాటు నవ్వులతోనే సినిమాని నడిపించొచ్చని నిరూపిస్తూ తన నట ప్రయాణం కొనసాగించారు. “ఆన‌లుగురు”, “మీ శ్రేయాభిలాషి” లాంటి గ‌ర్వించ‌ద‌గ్గ ఎన్నో చిత్రాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్ని సొంతం చేసుకున్న న‌ట‌కిరీటి డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్ ముఖ్య‌పాత్ర‌లో న‌టించిన చిత్రం బేవ‌ర్స్‌. సంజోష్‌, హ‌ర్షిత హీరో హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫంక్షన్‌ను ఇటీవల నిర్వహించింది చిత్ర యూనిట్‌.

Rajendra-Prasad

ఈ సందర్భంగా నటుడు రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. తన కూతురు గాయత్రి లేచిపోయి పెళ్లి చేసుకుందని, ఇప్పటికీ తాను ఆమెతో మాట్లాడనని చెప్పుకొచ్చాడు రాజేంద్రప్రసాద్‌. బేవర్స్‌ అనే టైటిల్ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారని, ఈ సినిమాకు బేవర్స్‌ అనే టైటిల్‌ ఎందుకు పెట్టారో సినిమా చూసిన తర్వాత అర్ధమవుతుందని ఆయన అన్నారు. తల్లిదండ్రులను అర్థం చేసుకోని పిల్లలు మాత్రమే బేవర్స్ కాదు… పిల్లల్ని అర్థం చేసుకోని తల్లిదండ్రులు కూడా బేవర్స్ అవుతారనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందించారు. సామాజిక స్పృహ ఉన్న చిత్రం. నా కెరీర్లో మరో సూపర్ హిట్ సినిమా చేశాను అనే తృప్తి వుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. ప్ర‌ముఖ ర‌చ‌యిత సుద్దాల అశోక్ త‌న మ‌న‌సు, ప్రాణం పెట్టి రాసిన‌.. త‌ల్లి త‌ల్లి నా చిట్టి త‌ల్లి నా ప్రాణాలే పోయాయ‌మ్మా.. మీరు ఎప్పటికీ మర్చిపోరు. నా కూతురి పేరు గాయత్రి. నేను ఆమెతో మాట్లాడను. డైరెక్టర్ ఈ పాట నాకు వినిపించిన రోజు నేను ఏడ్చాను. నా కూతురిని పిలిపించుకొని నాలుగు సార్లు వినిపించాను. అంత అద్భుతమైన పాట అది. ఈ పాట రాసిన సుద్దాలకు నా మనసు ఇచ్చేస్తున్నానని చెప్పారు రాజేంద్రప్రసాద్‌.

ఎప్పుడూ వ్యక్తిగత విషయాల్ని ప్రస్తావించని రాజేంద్రప్రసాద్ మరీ ఇంతలా భావోద్వేగానికి గురి కావటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మొత్తానికి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

- Advertisement -