రష్మీక మందన్నా… తెలుగులో హీరోయిన్ గా చేసింది మూడు సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ముఖ్యంగా కుర్రకారు మనసులో చెరగని ముద్ర వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తన అందం, అభినయం, నటనతో ఎంతో ప్రేక్షకుల్ని సంపాదించుకున్న ఈ భామ చేసింది తక్కువ సినిమాలే అయినా అన్ని హిట్ సినిమాలు తన ఖాతాలో చేరడంతో ఇప్పుడు ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ నటించిన దేవదాసు మూవీకి డివైడ్ టాక్ వచ్చినా రష్మీక నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఈ భామ డిమాండ్ మరింత పెరిగింది. దీంతో ఈ ముద్దుగుమ్మ తన రెమ్యూనరేషన్‌ను మరింత పెంచినట్టు తెలుస్తోంది.
అయితే రష్మీక మందన్నా తను తెలుగులో తొలిసారిగా నటించిన చిత్రం ఛలో. ఈ మూవీలో నాగశౌర్యతో జతకట్టిన రష్మీక ఈ మూవీలోని ఓ అనుభవాన్ని ఇటీవల బయటపెట్టింది. అదేంటంటే ఛలో సినిమా షూటింగ్‌కోసం ఓసారి గుంటూరు వెళ్లాల్సి వచ్చిందని, అక్కడి ఎండలతో తను రోస్ట్ అయ్యాయని చెప్పుకొచ్చింది రష్మీక. సాధారణంగా గుంటూరులో ఎండలు ఎక్కువగానే ఉంటాయి. పైగా అది ఎండాకాలం కావడంతో భగభగ మండే ఎండలతో రష్మీక ఉక్కిరిబిక్కిరి అయిందట.
రష్మీక కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతానికి చెందిన అమ్మాయి. కూర్గ్ ప్రత్యేకత ఏమంటే.. ఎప్పుడు చల్లగా ఉండి.. దట్టమైన కాఫీ తోటలతో నిండి ఉంటుంది. మేలో మనకు నిప్పులు చెరిగే సూరీడు ఉంటే.. మనకు కాస్త దూరంలో ఉన్న కూర్గ్ లో మాత్రం చలితో వణికిపోవాల్సిందే. చల్లని వాతావరణానికి అలవాటుపడ్డ రష్మీక ఎండల ధాటికి తట్టుకోలేక విలవిలలాడిందట. ఇప్పుడు రష్మీక గుంటూరు చెప్పగానే వామ్మో గుంటూరా..? అనేంత భయపడుతుందట రష్మీక.