తెలుగు బుల్లితెర చరిత్రలో అత్యంత ప్రజాధరణతో గత మూడు నెలలుగా విజయంతంగా ప్రసారం అయిన బిగ్‌బాస్ సీజన్ షోకు నేటితో తెరపడనుంది. గత వంద రోజులుగా ఎన్నో వివాదాలు, విమర్శలు, ఏడుపులు, ఎలిమినేషన్స్, రీ ఎంట్రీలతో హాట్‌హాట్‌గా సాగిన బిగ్‌బాస్ షో ఇవాళ లాస్ట్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. అయితే ఇప్పుడు బిగ్‌బాస్ 2 సీజన్‌ను మొదటి ఎపిసోడ్ నుంచి ఇంట్రెస్టింగ్గా చూస్తున్న బిగ్‌బాస్ ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. బిగ్‌బాస్ 2 సీజన్లో ఎవరు విజేతగా నిలిచారు. ఎవరు రన్నరప్‌గా నిలిచారు. అనే అంశంపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే బిగ్‌బాస్ 2 లో కౌశల్ విజేతగా నిలిచినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో కౌశల్ టైటిల్ అందుకున్న ఫోటోలు ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది.

బిగ్ బాస్ హౌజ్‌లో మొదటి నుండి ఎంతో డెడికేషన్‌తో ఉన్న వ్యక్తి కౌశల్. తనపై ఎవరు దూషణకి దిగిన, ఆయనని దూరం పెట్టిన కూడా ఎంతో నిబద్ధతతో ఉంటూ తనకంటూ ప్రత్యేక అభిమానాన్ని సంపాదించుకున్నాడు కౌశల్. ఇప్పుడు ఆ అభిమానం కౌశల్ ఆర్మీగా మారింది. బిగ్ బాస్ సీజన్ 2 కార్యక్రమంలో సీజన్ మొత్తానికి నామినేషన్ చేసే పవర్ గీతా మాధురికి బిగ్ బాస్ ఇవ్వగా, ఆమె ఆ అస్త్రాన్ని కౌశల్‌పై విసిరింది. అయిన్పప్పటికి ఓటమెరుగని విక్రమార్కుడిలా ఫినాలేకి చేరుకున్నాడు కౌశల్. కొద్ది రోజులుగా కౌశల్ ఆర్మీ ఆయనని గెలిపించేందుకు నిద్ర లేని రాత్రులు గడపింది. ఓ స్టార్ హీరోపై ఎంతటి ప్రేమ చూపిస్తారో అదే రేంజ్లో కౌశల్‌పై తమ అభిమానం చాటారు ఫ్యాన్స్. అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా కౌశల్ బిగ్‌బాస్ 2 టైటిల్ ను గెలిచారా లేదా అన్నది తెలియాలంటే ఇవాళ జరిగే బిగ్‌బాస్ 2 సీజన్ లాస్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే.

