టాలీవుడ్లో సక్సెస్ఫుల్ హీరోయిన్గా దూసుకుపోతుంది సమంత అక్కినేని.ఈ ఏడాది వరుస విజయాలు అందుకున్న సమంత షూటింగులకి కాస్త గ్యాప్ ఇచ్చింది. తన భర్త నాగ చైతన్యతో కలిసి స్పెయిన్‌లోని ఓ ఐలాండ్ ఐబిజాకి వెళ్లింది. వీరిద్దరితో పాటు అఖిల్ అక్కినేని, స్టైలిస్ట్ శిల్పారెడ్డి కూడా అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. నాగ్ కూడా తన ఫ్యామిలీతో సరదా క్షణాలు గడిపేందుకు బుధవారం హైదరాబాద్ నుంచి జెట్ ఫ్లైట్‌లో వెళ్ళారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.
కానీ అక్కడ దిగిన ఫోటోలు కొన్ని సమంత తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.అయితే ఈ ఫోటోల్లో సమంత అత్యంత కురచ దుస్తులు ధరించి ఉండటం ఆమె అభిమానులకు నచ్చలేదు. దీంతో ఓ పెళ్లైన మహిళ, అందులోనూ అక్కినేని వారింటి కోడలై ఉండి.. ఇటువంటి దుస్తులు ధరించడం ఏంటని ఫ్యాన్స్ సమంతపై ఫైర్ అయ్యారు. మరికొంత మంది శృతి మించి ట్రోల్స్ కూడా చేశారు.
వీటన్నింటికి సమంత దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘‘నేను నా వైవాహిక జీవితం ఎలా బతకాలో చెబుతున్నామని అనుకుంటున్న మీ అందరికి’’ అంటూ.. ఓ సిగ్నల్‌ని చూపిస్తూ.. వార్నింగ్ ఇచ్చినట్టుగా పోస్ట్ చేసింది. ఈ చర్యని కొందరు అభినందిస్తుండగా.. మరికొందరు మళ్లీ సమంతను టార్గెట్ చేస్తూ.. కామెంట్లు చేస్తున్నారు.