ఏషియన్‌ సినిమాస్‌తో శేఖర్ కమ్ముల

471
Shekar Kammula
- Advertisement -

కథ .. పాత్రలు వాస్తవానికి దగ్గరగా ఉండేలా చూసుకునే దర్శకులలో శేఖర్ కమ్ముల ముందు వరుసలో ఉంటారు. ఆయన సినిమాలు మనసును తాకే విధంగా ఉంటాయి గనుకనే, బాక్సాఫీసు వద్ద భారీ విజయాలను నమోదుచేస్తాయి. ఫిదా సినిమా తర్వాత నెక్ట్స్ సినిమాకు కమిట్ కాలేదు శేఖర్ కమ్ముల.

ఫిదా రేంజ్ లోనే ఉండాలని పక్కా కథ, స్క్రిప్ట్ ను రెడీ చేసుకుంటున్నాడు. ఇటీవలే సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఏషియన్ సినిమాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. మరోసారి ఓ రొమాంటిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకురానున్నాడు.

Shekar Kammula

యాభై సంవ‌త్స‌రాలుగా 600ల సినిమాల‌కు ఫైనాన్స్ అందించి ప్ర‌స్తుతం డిస్ట్రిబ్యూష‌న్‌, ఎగ్జిబిష‌న్ రంగాల‌లో అగ్ర‌గామి సంస్థ‌గా ఎదిగిన ఏషియ‌న్ గ్రూప్. శేఖర్ కమ్ముల తీయబోయే సినిమాకు నారాయణదాస్ నారంగ్, రామ్మోహన్ నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు.సినిమాకు సంబంధించి హీరోహీరోయిన్ల వివరాలతో పాటు ఇతర టెక్నీషియన్ల డీటెయిల్స్ ను త్వరలోనే వెల్లడించనున్నారు.

- Advertisement -